Get it on Google Play
Download on the App Store

యక్ష ప్రశ్నలు (Yakshaprasnas - Telugu) (UNK)


Telugu Contributor Y RAMA MOHAN
అరణ్యవాస సమయంలో ఐదు మంది పాండవులు ఒకసారి ఓ దట్టమైన అడవిలో ఓ జింక కోసం వెతుకుతూ,ఉండగా ధర్మరాజుకు దాహం వేస్తుంది. నీరు తీసుకురావడానికి మొదట సహదేవుడు వెళతాడు. ఓ కొలను చేరుకుంటాడు. నీళ్లు తాగబోయిన అతన్ని ఓ యక్షుడు వారించి మొదట తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ఆ తర్వాత దాహం తీర్చుకోమంటాడు. సహదేవుడు ఆ మాటను ఖాతరు చేయకుండా కొలనులో నీళ్లు తాగి, అవి విషప్రాయం అవటం చేత చనిపోతాడు. ఇలా ధర్మరాజు తన మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళనూ కూడా నీటికై పంపి వారంతా వెనుతిరిగి రాకపోయేసరికి తానె బయల్దేరి ఆ కొలను చేరుకొంటాడు. తన తమ్ముళ్ళవలె కాకుండా ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చి తన తమ్ముళ్లను బతికించుకుంటాడు . ఆ యక్ష ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన పరిపూర్ణమైన సమాధానాలే ఈ కథలో ఉన్నాయి, చదవండి.
READ ON NEW WEBSITE